సూక్తి

అక్షరాణి పరీక్ష్యంతాం అంబరాడంబరేణ కిమ్? శంభురంబరహీనోపి సర్వజ్ఞః కిం న జాయతే ?
( వేషాన్నేం పరీక్షిస్తారు? చదువును పరీక్షించండి. దిగంబరుడైతే మాత్రం - శివుడు సర్వజ్ఞుడు కాడా ?)

5, జులై 2014, శనివారం

"శ్రీ భువనేశ్వరీ అమ్మవారు"

సకల ఆర్థిక ఒడిదుడుకులనుండి, వ్యాపార సంబంధమైన సమస్యలనుండి రక్షించి ప్రజలలో మంచి గుర్తింపును & గౌరవాన్ని ప్రసాదించే

"శ్రీ భువనేశ్వరీ అమ్మవారు"


జ్యోతిర్మాలాం త్రిణేత్రాం వివిధ మణిలసత్ కుండలాం పద్మసంస్థామ్ ।

ఆద్యాం పాశాంకుశాభాం అభయవరకరాం భావయేత్ భువనేశీమ్ ।


ప్రతి నిత్యం పై మూర్తిని దర్శిస్తూ ధ్యాన శ్లోకాన్ని పఠించిన వ్యాపార సంబంధమైన దోషములు తొలగునని శాస్త్రవచనము.
ప్రతి గృహము యందు లేదా వ్యాపారస్థలములయందు ఈ మూర్తిని తూర్పు దిశలో పడమర ముఖముగా ఉంచి ఆరాధించిన త్వరితముగా వ్యాపారాదులలో అభివృద్ధి & ప్రజల మన్నత & సేవకుల అనుకూల సహకారములు కలుగునని శాస్త్రవచనము.
మీ
యల్.యస్.సిద్ధాన్తి —


"శ్రీ రాజమాతంగీ అమ్మవారు"

చూడగానే సరస్వతీ అమ్మవారనుకునేరు
వీణా ధారిణే కానీ సరస్వతీ అమ్మవారు కాదు
సకల ఆర్థిక ఒడిదుడుకులనుండి రక్షించి సంఘములో ఉన్నతమైన గుర్తింపును & గౌరవాన్ని ప్రసాదించే

"శ్రీ రాజమాతంగీ అమ్మవారు"


రత్నాసనాం శ్యామగాత్రీం శృణ్వంతీం శుకజల్పితమ్ ।

విభూషణైర్భూషితాం చ మాతంగీం ప్రణమామ్యహమ్ ।


ప్రతి నిత్యం పై మూర్తిని దర్శిస్తూ ధ్యాన శ్లోకాన్ని పఠించిన ఉద్యోగ సంబంధమైన దోషములు తొలగునని శాస్త్రవచనము.
ప్రతి గృహము యందు ఈ మూర్తిని తూర్పు దిశలో పడమర ముఖముగా ఉంచి ఆరాధించిన త్వరితముగా ఉద్యోగాదులలో అభివృద్ధి & అధికారుల మన్నన & ఉన్నత ఉద్యోగ యోగములు కలుగునని శాస్త్రవచనము.
మీ
యల్.యస్.సిద్ధాన్తి —


"శ్రీ అష్టభుజ వీరలక్ష్మీ అమ్మవారు"

"శ్రీ అష్టభుజ వీరలక్ష్మీ అమ్మవారు"

పాశాంకుశాక్షసూత్ర వరాభయ గదా పద్మపాత్ర హస్తా తథా ।

ఊరూ పద్మ దళాకారౌ వీర శ్రీ లక్ష్మిం భజే ।


ప్రతి నిత్యం పై మూర్తిని దర్శిస్తూ ధ్యాన శ్లోకాన్ని పఠించిన చోరత్వ సంబంధమైన దోషములు తగ్గుముఖం పట్టునని శాస్త్రవచనం.
ప్రతి గృహము యందు ఈ మూర్తిని పడమర దిశలో తూర్పు ముఖముగా ఉంచి ఆరాధించిన త్వరితముగా ఋణబాధలు తొలగునని శాస్త్రవచనము.
మీ
యల్.యస్.సిద్ధాన్తి —






"శ్రీ భిక్షాటన సాంబమూర్తి మహాస్వామి"

"శ్రీ భిక్షాటన సాంబమూర్తి మహాస్వామి"


చతుర్భుజం త్రినేత్రంచ నగ్నంచైవ స్మితాననమ్ ।

భస్మదిగ్ధం విద్రుమాభం కట్యాం పన్నగ సంవృతమ్ ।


ప్రతి నిత్యం పై మూర్తిని దర్శిస్తూ ధ్యాన శ్లోకాన్ని పఠించిన ఉదర సంబంధమైన, శిరోసంబంధమైన రోగములు తగ్గుముఖం పట్టునని శివ శాసనం చెబుతున్నది.
తల్లిదండ్రుల ఆరోగ్య నిమిత్తమై ఆరాధించవలసిన మూర్తి (దైవం) శ్రీ భిక్షాటన సాంబమూర్తి మహాస్వామి వారు.
మీ
యల్.యస్.సిద్ధాన్తి —



9, మే 2014, శుక్రవారం

శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి జన్మ జాతక చక్రం విశేష వివరములు

శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి జన్మ జాతక చక్రం విశేష వివరములు
౧౬౨౬ వ సంవత్సర తాళపత్ర ప్రతి నుండి సేకరణ

శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారిది మరియూ రామానుజాచార్యుల వారిది మరియూ మధ్వాచార్యుల వారిదీ ఆర్ద్రా నక్షత్రమే విశేషమేమిటంటే ముగ్గురు జగద్గురువులు

చాలామంది అభినవ శంకరులనే ఆది శంకరులు అనుకుంటూ ఉంటారు
నాకు లభించిన ఆధారములలో ఆచర్య పరంపర లో అభినవ శంకరులు ౩౬వ వారని వారు క్రీస్తు శకం ౭౮౮-౭౮౯వ సంవత్సర కాలంలో (విభవ నామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి)నాడు జన్మించినట్లు ౮౩౯ వ సంవత్సరంలో నిర్యాణము చెందినట్లుగా చెప్పబడి ఉన్నది

గోవిందపాదుల వారి సంతతి అయిన విక్రమాదిత్యుని కాలానికి (విక్రమార్క శకానికి) చెందినవారు అని కూడా బృహత్ శంకరవిజయము (సుఖాచార్య విరచితమ్) అను గ్రన్ధములో తెలుపబడినట్లుగా కలదు
భగవత్పాదులు క్రీస్తుపూర్వం ఈశ్వర నామ సంవత్సరంలోనే జన్మిన్చినట్లు పూర్వ గ్రంధములు తెలుపుతున్నవి.
శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి జన్మ జాతక చక్ర విమర్శనాత్మక వివరములు ఇంకా ౫ పేజీలు కలవు. తదుపరి పోస్ట్లో తెలుపగలవాడను.
మీ
యల్.యస్.సిద్ధాన్తి
౯౯౬౩౭౩౨౩౦౩ —


శ్రీకృష్ణ పరమాత్ముల వారి జన్మ జాతక విశేషములు

శ్రీకృష్ణ పరమాత్ముల వారి జన్మ జాతక చక్రం విశేష వివరములు
౧౬౨౬ వ సంవత్సర తాళపత్ర ప్రతి నుండి సేకరణ
మీ
యల్.యస్.సిద్ధాన్తి
౯౯౬౩౭౩౨౩౦౩ —





శ్రీ రామ చంద్ర స్వామి వారి జాతక చక్రం & జన్మ సమయ వివరములు

శ్రీరామ చంద్ర స్వామి వారి జన్మ జాతక చక్రం విశేష వివరములు
౧౬౨౬ వ సంవత్సర తాళపత్ర ప్రతి నుండి సేకరణ

కృతేతు మానవా ధర్మాః త్రేతాయాం గౌతమ స్మృతాః ।
ద్వాపరే శంఖలిఖితాః కలౌ పారాశరాః స్మృతాః ॥

కృత యుగము లో మను ధర్మ శాస్త్రం
త్రేతా యుగము లో గౌతమ ధర్మ శాస్త్రం
ద్వాపర యుగము లో శంఖలిఖిత ధర్మ శాస్త్రం
కలి యుగము లో పరాశర ధర్మ శాస్త్రం అనుసరించి నియమములు పాటించవలెను అని శ్శాస్త్రవచనం
"కలియుగ ధర్మాలతో త్రేతాయుగ ధర్మాలను కంపేర్ చేయకూదదండి"
ఆశ్వమేధ యాగం త్రేతాయుగములో ద్వాపరయుగము లో చేయమని ఆ ధర్మ శ్శాస్త్రములు చెబుతుంటే కలియుగము లో నిషిద్ధమని పరాశర స్మృతి చెబుతున్నది.
త్రేతాయుగములో గౌతమ ధర్మశ్శాస్త్రమును అనుసరించి బ్రాహ్మణులకు ౫ వత్సరములకు, క్షత్రియులకు ౮ వత్సరములకు ఉపనయనము చేయమని శ్శాస్త్రవచనం
కలియుగములో పరాశర ధర్మశ్శాస్త్రమును అనుసరించి బ్రాహ్మణులకు ౮ వత్సరములకు, క్షత్రియులకు ౧౧ వత్సరములకు ఉపనయనము చేయమని శ్శాస్త్రవచనం
ఇలాంటివి చాలా ఉన్నాయి
వేటికవే ఆ కాలానికి ప్రామనిక గ్రంధములు_గమనించగలరు.
మీ
యల్.యస్.సిద్ధాన్తి
౯౯౬౩౭౩౨౩౦౩