సూక్తి

అక్షరాణి పరీక్ష్యంతాం అంబరాడంబరేణ కిమ్? శంభురంబరహీనోపి సర్వజ్ఞః కిం న జాయతే ?
( వేషాన్నేం పరీక్షిస్తారు? చదువును పరీక్షించండి. దిగంబరుడైతే మాత్రం - శివుడు సర్వజ్ఞుడు కాడా ?)

9, మే 2014, శుక్రవారం

శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి జన్మ జాతక చక్రం విశేష వివరములు

శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి జన్మ జాతక చక్రం విశేష వివరములు
౧౬౨౬ వ సంవత్సర తాళపత్ర ప్రతి నుండి సేకరణ

శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారిది మరియూ రామానుజాచార్యుల వారిది మరియూ మధ్వాచార్యుల వారిదీ ఆర్ద్రా నక్షత్రమే విశేషమేమిటంటే ముగ్గురు జగద్గురువులు

చాలామంది అభినవ శంకరులనే ఆది శంకరులు అనుకుంటూ ఉంటారు
నాకు లభించిన ఆధారములలో ఆచర్య పరంపర లో అభినవ శంకరులు ౩౬వ వారని వారు క్రీస్తు శకం ౭౮౮-౭౮౯వ సంవత్సర కాలంలో (విభవ నామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి)నాడు జన్మించినట్లు ౮౩౯ వ సంవత్సరంలో నిర్యాణము చెందినట్లుగా చెప్పబడి ఉన్నది

గోవిందపాదుల వారి సంతతి అయిన విక్రమాదిత్యుని కాలానికి (విక్రమార్క శకానికి) చెందినవారు అని కూడా బృహత్ శంకరవిజయము (సుఖాచార్య విరచితమ్) అను గ్రన్ధములో తెలుపబడినట్లుగా కలదు
భగవత్పాదులు క్రీస్తుపూర్వం ఈశ్వర నామ సంవత్సరంలోనే జన్మిన్చినట్లు పూర్వ గ్రంధములు తెలుపుతున్నవి.
శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి జన్మ జాతక చక్ర విమర్శనాత్మక వివరములు ఇంకా ౫ పేజీలు కలవు. తదుపరి పోస్ట్లో తెలుపగలవాడను.
మీ
యల్.యస్.సిద్ధాన్తి
౯౯౬౩౭౩౨౩౦౩ —


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి