సూక్తి

అక్షరాణి పరీక్ష్యంతాం అంబరాడంబరేణ కిమ్? శంభురంబరహీనోపి సర్వజ్ఞః కిం న జాయతే ?
( వేషాన్నేం పరీక్షిస్తారు? చదువును పరీక్షించండి. దిగంబరుడైతే మాత్రం - శివుడు సర్వజ్ఞుడు కాడా ?)

8, ఆగస్టు 2014, శుక్రవారం

Sri manmatha nama samvatsara panchanga sadassu 2015-2016 Sri kalanirnaya panchangam_kanchi kaamakothi petham

చాలా సంతోషకరమైన విషయం
శ్రీశ్రీశ్రీ కంచి పరమాచార్యులవారి దివ్య ఆదేశము మేరకు సుమారు 110 సంవత్సరములనుండి ప్రతి సంవత్సరము జరుగు  పంచాంగ పండిత విద్వత్సభకు భారతదేశము లోని ప్రముఖ స్థలముల నుండి పంచాంగ కర్తలను & పండితులను ఆహ్వానించి వారందరికి ఒక వేదిక ఏర్పాటు చేసి ఎటువంటి సమస్యలూ లేకుండా అందరూ ఒకేరకముగా పండుగలు & పర్వదినములు నిర్ణయించాలి అని తీర్మానించడం జరిగినది

వచ్చే మన్మథ నామసంవత్సర (2015-2016) పంచాంగ విషయములు, పండుగల నిర్ణయ నిమిత్తం
మొట్టమొదటి సారిగా తెలుగు పంచాంగకర్తగా అధికారికముగా యల్.సుబ్రహ్మణ్య సిద్ధాన్తి ని పిలవడం జరిగినది.

ఇట్టి సభలో పంచాంగ కర్తలు, ఖగోళశాస్త్ర పండితులు, వేదపండితులు, సంస్కృత, వ్యాకరణ, తర్క, మీమాంస, న్యాయ శాస్త్ర పండితులు పాల్గొనిరి.
తమిలనాడు, శ్రీరంగం, కంచి, మధురై, కుమ్బకోణం, రామేశ్వరం దేవస్థాన పంచాంగకర్తలు, కేరళ, మైసూర్, కలకత్త, ముంబాయి, ఢిల్లి ప్రాంత పంచాంగకర్తలు నేను పాల్గొనడం జరిగినది.

04-08-2014 నుండి 06-08-2014 వరకు సభ జరిగినది.

ఈ సభ యందు ధృవీకరించిన విషయములు & నేను గణించిన శ్రీ కాలనిర్ణయ పంచాంగములోని పండుగలు, పర్వదినములు, తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ గణితములు, "గోదావరీ పుష్కర" నిర్ణయ, మౌఢ్య, గ్రహణ నిర్ణయ విషయములు ఒకేరీతిగా సశాస్త్రీయముగా ఉన్నవి అని సభా ఆమోదము పొందటము జరిగినది.

దానిని ధృవీకరిస్తూ శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతీ మహాస్వామివారు & శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతీ మహాస్వామివారు అధికారికముగా వారి "శ్రీముఖము" ను అందజేయటము జరిగినది.

sri jagadguru kanchi paramacharya swami vari divya adeshamu meraku sri manmatha nama samvatsara panchanga vidvatsabha
sabha yandu panchanga, siddhantha, samskrutha, vyakarana, tarka nyaya, memamsa, dharma shastra, veda panditulu palgoni ekagrevakamuga pandugalanu nirdharinchiri



































6, జులై 2014, ఆదివారం

"శ్రీ గజవాహన కార్తికేయ స్వామివారు"

ఋణ సంబంధమైన సమస్యలను తొలగించి అత్యంత శీఘ్రముగా ఋణబాధా విముక్తిని, అప్రాపిత ధన సంప్రాప్తిని (చాలా కాలంగా రావలసిన గడ్డు బాకీల బాధలను తొలగించి) లక్ష్మీ అనుగ్రహమును ప్రసాదించే
చాలా అరుదుగా దర్శనమిచ్చే

"శ్రీ గజవాహన కార్తికేయ స్వామివారు"

ఏకాననం ద్వినయనం వర కుక్కుటౌ చ ।

వామద్వయే నిశిత శక్తి అభయద్వయం చ ।

బిభ్రాణం ఈశ్వరసుతం తపనాయుతాభం ।

నిత్యం నమామి గజవాహనం ఇష్టసిద్ధ్యై ।।


ప్రతి నిత్యం పై మూర్తిని దర్శిస్తూ ధ్యాన శ్లోకాన్ని పఠించిన ఋణ సంబంధమైన దోషములు తొలగునని శాస్త్రవచనము.
ప్రతి గృహముయందు ఈ మూర్తిని దక్షిణ దిశలో ఉత్తర ముఖముగా ఉంచి బిల్వ (మారేడు) దళములతో ఆరాధించిన త్వరితముగా ఋణ బాధలు తొలగునని శాస్త్రవచనము.

ఈ వివరము సాక్షత్తూ పరమేశ్వరుడు విశ్వామిత్ర మహర్షికి, దూర్వాస మహర్షికి, అగస్త్య మహర్షికి ఉపదేశించినట్లుగా కుమార తంత్రం తెలుపుతున్నది.

మీ
యల్.యస్.సిద్ధాన్తి —


5, జులై 2014, శనివారం

"శ్రీ వినాయక శాంతి"

సంకటే సమనుప్రాప్తే యాజ్ఞవల్క్యేన యోగినా ।

శాంతిరుక్తా గణేశస్య కృత్వాతాం శుభమాచరేత్ ॥


"శ్రీ వినాయక శాంతి"

ద్వాత్రింశత్ గణేషారాధన, గణేశ మండలారాధనం, గో ముఖ ప్రసవం, గోయమల జనన శాంతి, ౯౬ ద్రవ్యములతో మహాభిషేకం, ౩౨ ద్రవ్యములతో హవనం, వినాయక కళ్యాణం, సుబ్రహ్మణ్య కళ్యాణం, గోదానం, మహాపూర్ణాహుతి.


"శ్రీ ఇంద్రాణీ అమ్మవారు"

వివాహ ఆటంక సంబంధమైన సమస్యలను తొలగించి అత్యంత శీఘ్రముగా (స్త్రీలకు) "వివాహ యోగమును", "దీర్ఘ సౌభాగ్యమును" ప్రసాదించే

"శ్రీ ఇంద్రాణీ అమ్మవారు"


ఐంద్రీ సహస్రదృక్ సౌమ్యా హేమాభా గజ సంస్థితా ।

వరదా అభయం దేవీ సౌభాగ్యం దేహిమే సదా ।।


ప్రతి నిత్యం పై మూర్తిని దర్శిస్తూ ధ్యాన శ్లోకాన్ని పఠించిన (స్త్రీలకు) వివాహ సంబంధమైన దోషములు తొలగునని శాస్త్రవచనము.
ప్రతి గృహముయందు, నివాస స్థలములయందు ఈ మూర్తిని వాయవ్య దిశలో ఆగ్నేయ ముఖముగా ఉంచి మందార పుష్పములతో ఆరాధించిన త్వరితముగా దోషాదులు తొలగి వివాహ అనుకూలత, దీర్ఘ సౌభాగ్యము కలుగునని శాస్త్రవచనము.
మీ
యల్.యస్.సిద్ధాన్తి —



"శ్రీ కౌమారీ అమ్మవారు"

వివాహ ఆటంక సంబంధమైన సమస్యలను తొలగించి అత్యంత శీఘ్రముగా (పురుషులకు) వివాహ యోగమును ప్రసాదించే

"శ్రీ కౌమారీ అమ్మవారు"


షడాననాతు కౌమారీ పాటలాభా సుశీలకా ।

రవిబాహుః మయూరస్థా వరదా శక్తిధారిణీ ।


ప్రతి నిత్యం పై మూర్తిని దర్శిస్తూ ధ్యాన శ్లోకాన్ని పఠించిన (పురుషులకు) వివాహ సంబంధమైన దోషములు తొలగునని శాస్త్రవచనము.
ప్రతి గృహముయందు, నివాస స్థలములయందు ఈ మూర్తిని దక్షిణ దిశలో ఉత్తర ముఖముగా ఉంచి ఎర్ర గన్నేరు పుష్పములతో ఆరాధించిన త్వరితముగా దోషాదులు తొలగి వివాహ అనుకూలత కలుగునని శాస్త్రవచనము.
మీ
యల్.యస్.సిద్ధాన్తి —


"శ్రీ భువనేశ్వరీ అమ్మవారు"

సకల ఆర్థిక ఒడిదుడుకులనుండి, వ్యాపార సంబంధమైన సమస్యలనుండి రక్షించి ప్రజలలో మంచి గుర్తింపును & గౌరవాన్ని ప్రసాదించే

"శ్రీ భువనేశ్వరీ అమ్మవారు"


జ్యోతిర్మాలాం త్రిణేత్రాం వివిధ మణిలసత్ కుండలాం పద్మసంస్థామ్ ।

ఆద్యాం పాశాంకుశాభాం అభయవరకరాం భావయేత్ భువనేశీమ్ ।


ప్రతి నిత్యం పై మూర్తిని దర్శిస్తూ ధ్యాన శ్లోకాన్ని పఠించిన వ్యాపార సంబంధమైన దోషములు తొలగునని శాస్త్రవచనము.
ప్రతి గృహము యందు లేదా వ్యాపారస్థలములయందు ఈ మూర్తిని తూర్పు దిశలో పడమర ముఖముగా ఉంచి ఆరాధించిన త్వరితముగా వ్యాపారాదులలో అభివృద్ధి & ప్రజల మన్నత & సేవకుల అనుకూల సహకారములు కలుగునని శాస్త్రవచనము.
మీ
యల్.యస్.సిద్ధాన్తి —