సూక్తి

అక్షరాణి పరీక్ష్యంతాం అంబరాడంబరేణ కిమ్? శంభురంబరహీనోపి సర్వజ్ఞః కిం న జాయతే ?
( వేషాన్నేం పరీక్షిస్తారు? చదువును పరీక్షించండి. దిగంబరుడైతే మాత్రం - శివుడు సర్వజ్ఞుడు కాడా ?)

18, నవంబర్ 2015, బుధవారం

2016-2017 durmukhi nama samvatsara kala nirnaya panchangam


వేదమున విధించబడిన నిత్యశ్రౌతస్మార్తాది సకల సత్కర్మానుష్ఠానమునకు తగిన కాలము నిర్ణయించుట జ్యోతిశ్శాస్త్రపు ముఖ్యప్రయోజనము. జటిల గణిత సాధ్యమైన తిధివార నక్షత్ర యోగకరణాదుల నిర్ణయము బహు ప్రాచీన కాలము నుండి అట్టి గణనము నందు నిష్ణాతులైన మన పంచాంగకర్తలు చేయుచూ వచ్చుచున్నారు. కాగా కొన్ని పంచాగముల యందు గ్రహణాది ప్రత్యక్ష గోచరములు కూడా తప్పిపోయెడి పొరపాట్లు దొర్లుచున్నవి. ఇట్టి ప్రమాదములను హరించుటకు తగు నిర్ణయములు తీసుకొనుటకు దోహదముగా శ్రీమఠం పరాపర గురువుల కాలము నుండి సదస్సులు జరుగుచున్నవి.
గత మూడు సంవత్సరములుగా ఈ సదస్సుకు వచ్చి చర్చలలో ప్రధాన భూమికను నిర్వహిస్తున్న శ్రీ దైవజ్ఞ సుబ్రమణ్య సిద్ధాన్తి గారు 2008 నుండి శ్రీ కంచి కామకోటి పీఠ పరిపాలిత కాల నిర్ణయ పంచాగమును వెలువరించుచున్నారు. ఇందలి నిర్ణయములన్నియూ శ్రీమఠమునందు నిర్వహింపబడు పంచాంగ పండిత సదస్సు నందు ఆమోదింపబడినవిగా ఉన్నాయి.
దుర్ముఖి నామ సంవత్సరమునకు కూడా ఇదే విధముగా పంచాగము వెలువరించబోతున్నారని తెలుసుకొని ఎంతో సంతసించినాము.
ఆస్తికులందరూ ఈ పంచాగమును తమ అనుష్ఠానములలో ఉపయోగించుకొని ఫలితములను పరిపూర్ణముగా పొందగలరు.
జగద్గురు శ్రీ శంకరాచార్య స్వామిగళ్
కంచి కామకోటి పీఠం

nache svakiyamuga rayabadina
durmukhi nama samvatsara kalanirnaya panchangam
free book andaru download chesukogalaru

LIKES MATRAME KAKUNDA TAPPAKUNDA SHARE CHEYAGALARU
TADVARAA ANDARIKI UPAYOGA PADUTUNDI





నాచే స్వకీయంగా గణించబడిన శ్రీ దుర్ముఖి నామ సంవత్సర కాలనిర్ణయ పంచాంగము 2016-2017 క్రింది లింక్ ద్వారా ఉచితముగా అందజేయబడుతున్నది.
మిత్రులు, సన్నిహితులు ప్రతి ఒక్కరూ దీనిని వినియోగించుకుని మీ మ్త్రులకు కూడా ఈ లింక్ ని శేర్ చేయగలరు.
విద్వత్ కృపాభిలాషి

దైవజ్ఞ సుబ్రహ్మణ్య సిద్ధాంతి


L S SIDDHANTHY NI TTD ASTHANA SIDDHANTHY NI CHEYAGALARU


L S SIDDHANTHY NI TTD ASTHANA SIDDHANTHY NI CHEYAGALARUదైవజ్ఞ సుబ్రహ్మణ్య సిద్ధాంతిని తిరుమల తిరుపతి దేవస్థానముల ఆస్థాన సిద్ధాంతిగా
( TTD ఆస్థాన సిద్ధాంతిగా) నియమించగలరు 
_ఆంధ్రప్రదేశ్, తెలంగాణా దృగ్గణిత పంచాంగకర్తల సమాఖ్య























18, అక్టోబర్ 2015, ఆదివారం

2016 durmuhurtha vishayam

2016 వ సంవత్సరం లో ప్రతిరోజుకి దుర్ముహూర్త సమయములు, ఇవ్వడము జరిగినది
Ls Siddhanthi











8, అక్టోబర్ 2015, గురువారం

14, సెప్టెంబర్ 2015, సోమవారం

2016 calendar

2016 TELUGU CALENDAR (MANMATHA NAMA SAMVATSARAM & DURMUKHI NAMA SAMVATSARAM) KAALA NIRNAYA PANCHANGAM CALENDAR _ by L S Siddhanthy
"Kaala Nirnaya Panchanga kartha" "Jyothisha kesari " "jyothisha chaturaanana "
Brahma Sri.DAIVAGNA SUBRAHMANYA SIDDHANTHY
e-mail: lssiddhanthy@gmail.com              lssiddhanthy.blogspot.com













23, ఆగస్టు 2015, ఆదివారం

మంగళ గౌరీ వ్రతములు మరియూ వర లక్ష్మీ వ్రతాదులు


మౌఢ్యమి యందు సింహస్థ గురు సమయము యందు నూతనముగా ఆచరించు మంగళ గౌరీ వ్రతములు మరియూ వర లక్ష్మీ వ్రతాదులు పనికి రావు
ఈ విషయము కేవలము మొదటి సారి ఆచరించువారి విషయములోనే
కేవలం "భుజంగమూల" అను ఒక శ్లోకాన్ని పట్టుకుని ఎలాంటి వ్రతాదులైనా ఆచరించవచ్చును
మౌడ్య దోషముండదు అని చెబుతున్నారు
కాని "ముహూర్త దర్పణము"నకు ఆ గ్రంధకర్తకు ఆధారమైన "కాలప్రకాశిక" లో పూర్తి వివరణ కలదు
మొదటిసారి చేయు దానము, మొదటిసారి చేయు విశేషమైన దేవతా క్షేత్ర యాత్ర కూడా పనికిరాదు
"భుజంగమూల" అను శ్లోకములో కేవలం ప్రతి వత్సరం ఆచరించే వ్రతాదులకు దోషములేదని చెప్పుటయే కాని "మొదటి సారి ప్రారంభించు వారుకూడా అచరించవచ్చునని చెప్పబడలేదు
వ్యక్తికన్నా శాస్త్రమే ప్రమాణము
ఆరంభము పనికిరాదు అన్నప్పుడు మొదటి వత్సరమైనా మూడవ వత్సరమైనా ఒక్కటే
మొదటి వత్సరమునకు దోషమని శాస్త్రములో చెప్పలేదు
మొదటిసారి (ఆరంభమునకు) దొషమని ఉన్నది
"యద్యదాచరతి శ్రేష్ఠః తత్త దేవేతరో జనః "
అనే వాక్యము గొప్పది కావడానికి
ఉత్తములు (పెద్దలు) ఏయే వాటిని ఆచరింతురో ఆయావాటిని మాత్రమే ఇతర జనులు ప్రమాణముగా తీసుకుందురు.
కారణము
ఉత్తములు (పెద్దలు) ముందుగా విమర్శతో పలు శాస్త్రములను పరిశీలించి అయా సమయములకు ఏది ధర్మమో దానిని ఆచరించుదురు కనుక వారిని అనుసరించవచ్చును అని చెప్పబడి ఉన్నది
"వ్రతములు చేయవచ్చును" కాని మొదటి సారి ఆచరించు వారికి పనికి రాదు అనే అంశాన్ని గమనించాలి

https://www.facebook.com/siddhanthy.ls/posts/971377119592113

ప్రథమోపాకర్మ (నవోపాకర్మ) నిర్ణయం

ప్రథమోపాకర్మ (నవోపాకర్మ) నిర్ణయం
https://www.facebook.com/photo.php?fbid=962789613784197&set=a.493900347339795.1073741826.100001595028485&type=1&hc_location=ufi