సూక్తి

అక్షరాణి పరీక్ష్యంతాం అంబరాడంబరేణ కిమ్? శంభురంబరహీనోపి సర్వజ్ఞః కిం న జాయతే ?
( వేషాన్నేం పరీక్షిస్తారు? చదువును పరీక్షించండి. దిగంబరుడైతే మాత్రం - శివుడు సర్వజ్ఞుడు కాడా ?)

5, మార్చి 2016, శనివారం

దైవజ్ఞ వరాహమిహిర ( Daivajna Varāhamihira )


ప్రస్తుతం మనదేశం నుండి ఇస్రో, అమెరికా నుండి నాసా అంతరిక్ష వీక్షణం చేస్తూ మన విశ్వం గురించి ఎన్నో విషయాలను కనుగొంటున్నారు. అయితే భారతదేశానికి చెందిన ఉజ్జయిని దేశస్థుడు ఖగోళ, గణిత శాస్త్రజ్ఞుడు, మరియు జ్యోతిష్కుడు అయిన వరాహమిహిర 1500 సంవత్సరాల క్రితమే విశ్వం గురించి, మన గ్రహాల గురించి తన పుస్తకంలో అంచనా వేసి రాసుకున్నాడు. ఆయన రాసిన వాటిని గురించి తెలుసుకున్న మన శాస్త్రవేత్తలు ప్రస్తుతం షాక్ కు గురవతున్నారు ___
దైవజ్ఞ వరాహమిహిర ( Daivajna Varāhamihira )

ఉజ్జయిని నగరానికి సమీపంలో క్రీ.శ 4 వ శతాబ్దంలో 499 వ సంవత్సరం లో ఆదిత్యదాసుడనే జ్యోతిశ్శాస్త్ర పండితునకు జన్మించాడు మిహిరుడు. తండ్రి వద్ద గణిత జ్యోతిశ్శాస్త్రములు నేర్చుకున్న మిహిరుడు పాట్నా లో నాటి సుప్రసిద్ధ గణీత శాస్త్రవేత్త ఆర్యభట్టు ను కలుసుకొని ఆయనతో శాస్త్ర చర్చ జేశాడు. అనంతరము ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాలను అధ్యయనం జేయాలని నిర్ణయించుకొని అసాధారణ కృషి సలిపారు. ఆయన నిరంతర అధ్యయన ఫలితాలు అతని గ్రంథాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. వరహమిహిర సుర్య సిద్ధాంత అను పేరు మీద 1515 వ సంవత్సరములో (16 సంవత్సరములకే) వారు మొదటి గ్రంధమును రాసారు గణిత శాస్త్రజ్ఞుడైనా అనేక శాస్త్ర విషయాలను వివరించారు.
మిహిరుడు వరాహ మిహిరునిగా

అనతి కాలంలో ఉజ్జయిని గొప్ప విద్యా కేంద్రము, అక్కడ కళలు, సంస్కృతి, విజ్ఞాన శాస్త్రము అనే అంశాలలో ప్రసిద్ధులైన ఎందరో పండితులు సుదూరాల నుంచి వచ్చేవారు. పరస్పర భావ వినిమయం వుండేది. అచ్చటి శాస్త్ర చర్చలలో మిగిరుని శాస్త్ర పటిమ తెలియ వచ్చిన రెండవ విక్రమాదిత్య చంద్ర గుప్తుడు తన ఆస్థాన మండలి నవరత్నములలో నొకనిగా ఆయనకు గౌరవించాడు. దీనికి సంబంధించిన ఒక సంఘటన చెప్తారు. విక్రమాదిత్యుని కుమారుడు వరాహము కారనంగా మరణిస్తాడని మిహిరుడు జ్యోతిషము చెప్పగా రాజు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతో కట్టుదిట్టము చేసినా శాస్త్ర ప్రకారము చెప్పిన సమయానికి, చెప్పిన కారనముగానే రాకుమారుడు మరణిస్తే విక్రమాదిత్యుడు తన కుమారుని గతికి విలపించినా మిహిరుని ప్రతిభను శ్లాఘించి మగధ సామ్రాజ్య గౌరవ చిహ్నము వరహముద్రాంకితముతో సత్కరించాడు. నాటి నుంచి ఆ జ్యోతిః శాస్త్ర వేత్త వరాహమిహిరుడుగా పిలువబడ్డాడు. వేదాలన్నీ చదివి ఎంతో పండితుడైనా మానవాతీత శక్తులను గ్రుడ్డిగా నమ్మేవాడు కాడు. అతనొక అద్భుత శాస్త్రవేత్త!
ఆయన జ్యోతిష శాస్త్రంలో మూడు ముఖ్యమైన విభాగాలను వ్రాసారు.
· పంచ సిద్ధాంతిక .
· బృహత్ జాతక - హిందూ ఖగోళ శాస్త్రం మరియు జాతక గ్రంథం లో గల ఐదు ముఖ్య గ్రంథములలో ఒకటి.
· లఘు జాతక
· సమస సంహిత
· బృహత్ యోగ యాత్ర
· యోగ యాత్ర
· టిక్కని యాత్ర
· బృహత్ వివాహ పటాల
· లఘ వివాహ పటాల.
· లగ్న వారాహి
· కుతూహల మంజరి
· దైవజ్ఞ వల్లభః
ఆయన కుమారుడు ప్రితుయాసాస్ కూడా ఖగోళ శాస్త్రంలో మంచి రచనలు చేశారు. ఆయన "హోర సార" అనె ప్రసిద్ధ రచన జ్యోతిష శాస్త్రం పై రాశాడు. మధ్యయుగ బెంగాలీకి చెందిన ఖానా (లీలావతి) కవయిత్రి, జ్యోతిష్యురాలును వరాహమిహిర కోడలుగా చేసుకున్నారు.
ఆయన ఆర్యభట్టు కనిపెట్టిన సైన్ టేబుల్ యొక్క విలువలని మరింత నిరుష్టంగా చేసారు. అంక గణితం (Arithmetic) లో సున్నా మరియు అభావిక సంఖ్యల (NegativeNumbers)గుణాలని వివరించాడు.
వరాహ మిహిర సూర్య సిద్ధాంత గ్రంధం
సూర్య సిద్ధాంత గ్రంధంలో నక్షత్ర మండలాలు, ఇతర సౌర గ్రహణాలు వాటి స్థానాలను గురించి వరాహమిహిర తెలిపాడు. ఇందులో , దేవతలు మరియు రాక్షసులు, దేవుడు బ్రహ్మ సృష్టి నుండి గడచిన కాలానికి చెందిన రోజు మరియు రాత్రి, గ్రహాలు తూర్పు తరలించడానికి మరియు నక్షత్ర విప్లవం సంవత్సరం పొడవు గురించి పేర్కొన్నారు. . భూమి వ్యాసం, చుట్టుకొలత, చంద్రుడి యొక్క రంగు ,చుట్టుకొలతలను ఈ పుస్తకంలో వరాహమిహిర తెలిపాడు. ఇంకా ఈ పుస్తకంలో అంగారక గ్రహం గురించి ఎంతో వివరంగా తెలిపాడు. ఆయన ఆ పుస్తకంలో అంగారక గ్రహంపై నీరు మరియు ఇనుము ఉన్నట్లు అప్పుడే చెప్పారు. ఈ విషయాన్ని నాసా మరియు ఇస్రో బహిర్గతం చేశాయి. ఇంకా ఈ పుస్తకంలో సౌరవ్యవస్థలోని ప్రతి గ్రహం సూర్యునిచే సృష్టించబడింది అని వివరంగా చెప్పాడు
కొన్ని ఏళ్ళ క్రితం వరాహమిహిర రాసిన సూర్యసిద్ధాంత గ్రంధం ప్రస్తుతం దొంగలించబడింది. అయితే ముందుచూపుగా కొందరు మేధావులు రికార్డ్ చేసుకోవడం వలన ముందుముందు పరిశోధనలకు ఉపయోగపడింది. ఇలా రికార్డ్ చేయబడిన ఆ గ్రంధంలోని విషయాలను చాలా భాషలలోకి అనువాదం చేయడం జరిగింది. నాసా అంగారక గ్రహంపై పరిశోధన చేస్తున్నప్పుడు, రిటైర్డ్ ఐపిఎస్ అయిన అరుణ్ ఉపాధ్యాయ్ వరాహమిహిర అంగారక గ్రహం గురించి రాసిన విషయాలను అధ్యయనం చేశాడు. ఆ అధ్యయనం ఆయన అంగారక గ్రహంపై ఒక పుస్తకాన్ని రాశాడు.

సంపూర్ణ సూర్యగ్రహణ నిర్ణయం 9-3-2016 బుధవారము total solar eclipse 9 march 2016

సంపూర్ణ సూర్యగ్రహణ నిర్ణయం 9-3-2016 బుధవారము total solar eclipse 9 march 2016
(కంచి సభ లో ఆమోదింపబడిన నిర్ణయములు)
నాచే స్వకీయంగా గణించబడిన ప్రపంచ వ్యాప్తంగా పలుప్రాంతములకు, భారతదేశమునందు కల ప్రముఖ ప్రాంతములకు మరియూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రముల యందు ప్రముఖ ప్రాంతములకు సెకన్లతో సహా గ్రహణ వివరములకు, గ్రహణ సమయ నియమాదులకు, గ్రహణ శాంతి వివరములకై కింది లింక్ ద్వారా పొందగలరు
మరియూ
నాచే స్వకీయంగా గణించబడిన శ్రీ దుర్ముఖి నామ సంవత్సర కాలనిర్ణయ పంచాంగము 2016-2017 క్రింది లింక్ ద్వారా ఉచితముగా అందజేయబడుతున్నది.

మిత్రులు, సన్నిహితులు ప్రతి ఒక్కరూ దీనిని వినియోగించుకుని మీ మితృలకు కూడా ఈ లింక్ ని శేర్ చేయగలరు.
నాచే స్వకీయంగా గణించబడిన పంచాంగ పుస్తకప్రతులు "మోహన్ పబ్లికేషన్స్" వారి ద్వారా ప్రచురితమై రెండు రాష్ట్రములందు కల అన్ని ప్రముఖ పుస్తక షాపులయందు లభించును.
విద్వత్ కృపాభిలాషి
దైవజ్ఞ సుబ్రహ్మణ్య సిద్ధాంతి

SAMPURNASURYAGRAHANAMBYLSSIDDHANTHY/


శ్రీ మన్మథ నామ సంవత్సర మహాశివరాత్రి లింగోద్భవ కాల నిర్ణయం _ls siddhanthiశ్రీ మన్మథ నామ సంవత్సర మహాశివరాత్రి లింగోద్భవ కాల నిర్ణయం _
Ls Siddhanthi
ఒక కణము జలము ఒక్కింత భస్మముతో పరవశించి అనుగ్రహించెదవా పరమ శివా ।
ఈ లింగోద్భవ కాలం & ప్రమాణము నకు సంబంధించిన గణితము & సూత్రములకై సుమారు సంవత్సరము పాటు అన్వేషించడము జరిగినది.
నా గురువర్యుల (యజ్జా శ్రీనివాస సిద్ధాంతి గురువుగారి) అనుగ్రహముతో ఒక తాళపత్రములో దీనిగురించి తెలుసుకోవడము జరిగినది.
అప్పటి నుండి ప్రతిసంవత్సరము (గత అయిదు సంవత్సరముల నుండి) తెలియపరుస్తూ ఉన్నాను
మిత్రులు, సన్నిహితులు ప్రతి ఒక్కరూ దీనిని వినియోగించుకుని మీ మితృలకు కూడా ఈ లింక్ ని శేర్ చేయగలరు.
విద్వత్ కృపాభిలాషి
దైవజ్ఞ సుబ్రహ్మణ్య సిద్ధాంతి