సూక్తి

అక్షరాణి పరీక్ష్యంతాం అంబరాడంబరేణ కిమ్? శంభురంబరహీనోపి సర్వజ్ఞః కిం న జాయతే ?
( వేషాన్నేం పరీక్షిస్తారు? చదువును పరీక్షించండి. దిగంబరుడైతే మాత్రం - శివుడు సర్వజ్ఞుడు కాడా ?)

23, ఆగస్టు 2015, ఆదివారం

మంగళ గౌరీ వ్రతములు మరియూ వర లక్ష్మీ వ్రతాదులు


మౌఢ్యమి యందు సింహస్థ గురు సమయము యందు నూతనముగా ఆచరించు మంగళ గౌరీ వ్రతములు మరియూ వర లక్ష్మీ వ్రతాదులు పనికి రావు
ఈ విషయము కేవలము మొదటి సారి ఆచరించువారి విషయములోనే
కేవలం "భుజంగమూల" అను ఒక శ్లోకాన్ని పట్టుకుని ఎలాంటి వ్రతాదులైనా ఆచరించవచ్చును
మౌడ్య దోషముండదు అని చెబుతున్నారు
కాని "ముహూర్త దర్పణము"నకు ఆ గ్రంధకర్తకు ఆధారమైన "కాలప్రకాశిక" లో పూర్తి వివరణ కలదు
మొదటిసారి చేయు దానము, మొదటిసారి చేయు విశేషమైన దేవతా క్షేత్ర యాత్ర కూడా పనికిరాదు
"భుజంగమూల" అను శ్లోకములో కేవలం ప్రతి వత్సరం ఆచరించే వ్రతాదులకు దోషములేదని చెప్పుటయే కాని "మొదటి సారి ప్రారంభించు వారుకూడా అచరించవచ్చునని చెప్పబడలేదు
వ్యక్తికన్నా శాస్త్రమే ప్రమాణము
ఆరంభము పనికిరాదు అన్నప్పుడు మొదటి వత్సరమైనా మూడవ వత్సరమైనా ఒక్కటే
మొదటి వత్సరమునకు దోషమని శాస్త్రములో చెప్పలేదు
మొదటిసారి (ఆరంభమునకు) దొషమని ఉన్నది
"యద్యదాచరతి శ్రేష్ఠః తత్త దేవేతరో జనః "
అనే వాక్యము గొప్పది కావడానికి
ఉత్తములు (పెద్దలు) ఏయే వాటిని ఆచరింతురో ఆయావాటిని మాత్రమే ఇతర జనులు ప్రమాణముగా తీసుకుందురు.
కారణము
ఉత్తములు (పెద్దలు) ముందుగా విమర్శతో పలు శాస్త్రములను పరిశీలించి అయా సమయములకు ఏది ధర్మమో దానిని ఆచరించుదురు కనుక వారిని అనుసరించవచ్చును అని చెప్పబడి ఉన్నది
"వ్రతములు చేయవచ్చును" కాని మొదటి సారి ఆచరించు వారికి పనికి రాదు అనే అంశాన్ని గమనించాలి

https://www.facebook.com/siddhanthy.ls/posts/971377119592113

1 కామెంట్‌: