సూక్తి

అక్షరాణి పరీక్ష్యంతాం అంబరాడంబరేణ కిమ్? శంభురంబరహీనోపి సర్వజ్ఞః కిం న జాయతే ?
( వేషాన్నేం పరీక్షిస్తారు? చదువును పరీక్షించండి. దిగంబరుడైతే మాత్రం - శివుడు సర్వజ్ఞుడు కాడా ?)

30, సెప్టెంబర్ 2014, మంగళవారం

గ్రహణ నిర్ణయం

చంద్రగ్రహణం 08-10-2014 బుధవారం

స్వస్తిశ్రీ జయ నామ సంవత్సర ఆశ్వీయుజ శుద్ధ ౧౫ బుధవారం దివి. 08-10-2014
రేవతీ నక్షత్ర ప్రథమ ద్వితీయ పాద సంచార సమయే కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం
నైఋతి స్పర్శ, ఈశాన్య మోక్షం
గ్రహణ స్పర్శ, గ్రహణ మధ్యకాలములు భారత దేశమందు కనిపించకపోయిననూ గ్రహణ మోక్ష (విడుపు) కాలం కనిపించడం వలన గ్రహణ నియమములు తప్పక పాటించవలయును.
సంపూర్ణ చంద్రగ్రహణమైనప్పటికీ భారత దేశమందు పాక్షికముగా కొద్ది సమయము మాత్రమే కనిపించును
అయిననూ ప్రారంభ సమయము నుండి గ్రహణ నియమములు తప్పక పాటించవలయును.
గ్రహణ స్పర్శ, గ్రహణ మధ్య, గ్రహణ మోక్ష కాలములలో ఏ ఒక్క కాలమైనా దృశ్యమైనప్పుడు (కనిపించినప్పుడు) తప్పనిసరిగా గ్రహణ ప్రారంభ సమయము నుండి గ్రహణ నియమములు తప్పక పాటించవలయును.
చంద్రోదయము తరువాత కూడా సూర్య రశ్మి వలన దృశ్యాదృశ్యముగా (కనీకనిపించకుండా) ఉన్న ప్రాంతములయందు చంద్రోదయము నుండి గ్రహణ మోక్షకాలము వరకు గ్రహణ నియమములు తప్పక పాటించవలయును.
మోక్షకాలము తరువాత చంద్రోదయము అయిన ప్రాంతములవారు గ్రహణ నియమములు పాటించవలసిన అవసరము లేదు. యల్.యస్.సిద్ధాంతి






Atlanta, United States
Chandra GrahanM - 8th October 2014















1 కామెంట్‌: