సూక్తి

అక్షరాణి పరీక్ష్యంతాం అంబరాడంబరేణ కిమ్? శంభురంబరహీనోపి సర్వజ్ఞః కిం న జాయతే ?
( వేషాన్నేం పరీక్షిస్తారు? చదువును పరీక్షించండి. దిగంబరుడైతే మాత్రం - శివుడు సర్వజ్ఞుడు కాడా ?)

30, సెప్టెంబర్ 2014, మంగళవారం

గ్రహణ నిర్ణయం

చంద్రగ్రహణం 08-10-2014 బుధవారం

స్వస్తిశ్రీ జయ నామ సంవత్సర ఆశ్వీయుజ శుద్ధ ౧౫ బుధవారం దివి. 08-10-2014
రేవతీ నక్షత్ర ప్రథమ ద్వితీయ పాద సంచార సమయే కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం
నైఋతి స్పర్శ, ఈశాన్య మోక్షం
గ్రహణ స్పర్శ, గ్రహణ మధ్యకాలములు భారత దేశమందు కనిపించకపోయిననూ గ్రహణ మోక్ష (విడుపు) కాలం కనిపించడం వలన గ్రహణ నియమములు తప్పక పాటించవలయును.
సంపూర్ణ చంద్రగ్రహణమైనప్పటికీ భారత దేశమందు పాక్షికముగా కొద్ది సమయము మాత్రమే కనిపించును
అయిననూ ప్రారంభ సమయము నుండి గ్రహణ నియమములు తప్పక పాటించవలయును.
గ్రహణ స్పర్శ, గ్రహణ మధ్య, గ్రహణ మోక్ష కాలములలో ఏ ఒక్క కాలమైనా దృశ్యమైనప్పుడు (కనిపించినప్పుడు) తప్పనిసరిగా గ్రహణ ప్రారంభ సమయము నుండి గ్రహణ నియమములు తప్పక పాటించవలయును.
చంద్రోదయము తరువాత కూడా సూర్య రశ్మి వలన దృశ్యాదృశ్యముగా (కనీకనిపించకుండా) ఉన్న ప్రాంతములయందు చంద్రోదయము నుండి గ్రహణ మోక్షకాలము వరకు గ్రహణ నియమములు తప్పక పాటించవలయును.
మోక్షకాలము తరువాత చంద్రోదయము అయిన ప్రాంతములవారు గ్రహణ నియమములు పాటించవలసిన అవసరము లేదు. యల్.యస్.సిద్ధాంతి


Atlanta, United States
Chandra GrahanM - 8th October 201429, సెప్టెంబర్ 2014, సోమవారం

2015 Calendar _by L S Siddhanthy_2015 క్యాలెండర్_యల్.యస్.సిద్ధాంతి.

2015 Calendar_ JANUARY _by L S Siddhanthy

కల్యాది ౫౧౧౫, శాలివాహన శకం ౧౯౩౬,
శ్రీ జయ నామ సంవత్సర పౌష్య శుద్ధ ఏకాదశి గురువారం నుండి
శ్రీ జయ నామ సంవత్సర మాఘ శుద్ధ ద్వాదశి శనివారం వరకు

2015 క్యాలెండర్ _ జనవరి _ యల్.యస్.సిద్ధాంతి.

శ్రీ కాలనిర్ణయ పంచాంగకర్త,
శ్రీ లలితాంబికా జ్యోతిషామృత నిలయం.


2015 Calendar_ FEBRUARY _by L S Siddhanthy

కల్యాది ౫౧౧౫, శాలివాహన శకం ౧౯౩౬,
శ్రీ జయ నామ సంవత్సర మాఘ శుద్ధ త్రయోదశి ఆదివారం నుండి
శ్రీ జయ నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ దశమి శనివారం వరకు

2015 క్యాలెండర్ _ ఫిబ్రవరి _ యల్.యస్.సిద్ధాంతి.

శ్రీ కాలనిర్ణయ పంచాంగకర్త,
శ్రీ లలితాంబికా జ్యోతిషామృత నిలయం.


2015 Calendar_ MARCH _by L S Siddhanthy

కల్యాది ౫౧౧౫-౫౧౧౬, శాలివాహన శకం ౧౯౩౬-౧౯౩౭,
శ్రీ జయ నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ ఏకాదశి ఆదివారం నుండి
శ్రీ మన్మథ నామ సంవత్సర చైత్ర శుద్ధ ఏకాదశి మంగళవారం వరకు

2015 క్యాలెండర్ _ మార్చి _ యల్.యస్.సిద్ధాంతి.

శ్రీ కాలనిర్ణయ పంచాంగకర్త,
శ్రీ లలితాంబికా జ్యోతిషామృత నిలయం.2015 Calendar_ APRIL _by L S Siddhanthy

కల్యాది ౫౧౧౬, శాలివాహన శకం ౧౯౩౭,
శ్రీ మన్మథ నామ సంవత్సర చైత్ర శుద్ధ ద్వాదశి బుధవారం నుండి
శ్రీ మన్మథ నామ సంవత్సర వైశాఖ శుద్ధ ద్వాదశి గురువారం వరకు

2015 క్యాలెండర్ _ ఏప్రిల్ _ యల్.యస్.సిద్ధాంతి.

శ్రీ కాలనిర్ణయ పంచాంగకర్త,
శ్రీ లలితాంబికా జ్యోతిషామృత నిలయం.


2015 Calendar_ MAY _by L S Siddhanthy

కల్యాది ౫౧౧౬, శాలివాహన శకం ౧౯౩౭,
శ్రీ మన్మథ నామ సంవత్సర వైశాఖ శుద్ధ త్రయోదశి శుక్రవారం నుండి
శ్రీ మన్మథ నామ సంవత్సర జ్యేష్ట శుద్ధ త్రయోదశి ఆదివారం వరకు

2015 క్యాలెండర్ _ మే _ యల్.యస్.సిద్ధాంతి.

శ్రీ కాలనిర్ణయ పంచాంగకర్త,
శ్రీ లలితాంబికా జ్యోతిషామృత నిలయం.


2015 Calendar_ JUNE _by L S Siddhanthy

కల్యాది ౫౧౧౬, శాలివాహన శకం ౧౯౩౭,
శ్రీ మన్మథ నామ సంవత్సర జ్యేష్ట శుద్ధ చతుర్దశి సోమవారం నుండి
శ్రీ మన్మథ నామ సంవత్సర అధిక ఆషాడ శుద్ధ త్రయోదశి మంగళవారం వరకు

2015 క్యాలెండర్ _ జూన్ _ యల్.యస్.సిద్ధాంతి.

శ్రీ కాలనిర్ణయ పంచాంగకర్త,
శ్రీ లలితాంబికా జ్యోతిషామృత నిలయం.


2015 Calendar_ JULY _by L S Siddhanthy

కల్యాది ౫౧౧౬, శాలివాహన శకం ౧౯౩౭,
శ్రీ మన్మథ నామ సంవత్సర అధిక ఆషాఢ శుద్ధ చతుర్దశి బుధ వారం నుండి
శ్రీ మన్మథ నామ సంవత్సర నిజ ఆషాఢ శుద్ధ పౌర్ణిమ శుక్ర వారం వరకు

2015 క్యాలెండర్ _ జులై _ యల్.యస్.సిద్ధాంతి.

శ్రీ కాలనిర్ణయ పంచాంగకర్త,
శ్రీ లలితాంబికా జ్యోతిషామృత నిలయం.


2015 Calendar_ AUGUST _by L S Siddhanthy

కల్యాది ౫౧౧౬, శాలివాహన శకం ౧౯౩౭,
శ్రీ మన్మథ నామ సంవత్సర నిజ ఆషాఢ బహుళ పాడ్యమి శని వారం నుండి
శ్రీ మన్మథ నామ సంవత్సర శ్రావణ బహుళ విదియ సోమ వారం వరకు

2015 క్యాలెండర్ _ అగస్ట్ _ యల్.యస్.సిద్ధాంతి.

శ్రీ కాలనిర్ణయ పంచాంగకర్త,
శ్రీ లలితాంబికా జ్యోతిషామృత నిలయం


2015 Calendar_ SEPTEMBER _by L S Siddhanthy

కల్యాది ౫౧౧౬, శాలివాహన శకం ౧౯౩౭,
శ్రీ మన్మథ నామ సంవత్సర శ్రావణ బహుళ తదియ మంగళ వారం నుండి
శ్రీ మన్మథ నామ సంవత్సర భాద్రపద బహుళ తదియ బుధ వారం వరకు 

2015 క్యాలెండర్ _ సెప్టెంబర్ _ యల్.యస్.సిద్ధాంతి.

శ్రీ కాలనిర్ణయ పంచాంగకర్త,
శ్రీ లలితాంబికా జ్యోతిషామృత నిలయం.


2015 Calendar_ OCTOBER _by L S Siddhanthy

కల్యాది ౫౧౧౬, శాలివాహన శకం ౧౯౩౭,
శ్రీ మన్మథ నామ సంవత్సర భాద్రపద బహుళ చవితి గురు వారం నుండి
శ్రీ మన్మథ నామ సంవత్సర ఆశ్వీయుజ బహుళ పంచమి శని వారం వరకు

2015 క్యాలెండర్ _ అక్టోబర్ _ యల్.యస్.సిద్ధాంతి.

శ్రీ కాలనిర్ణయ పంచాంగకర్త,
శ్రీ లలితాంబికా జ్యోతిషామృత నిలయం.


2015 Calendar_ NOVEMBER _by L S Siddhanthy

కల్యాది ౫౧౧౬, శాలివాహన శకం ౧౯౩౭,
శ్రీ మన్మథ నామ సంవత్సర ఆశ్వీయుజ బహుళ షష్ఠి ఆది వారం నుండి
శ్రీ మన్మథ నామ సంవత్సర కార్తీక బహుళ పంచమి సోమ వారం వరకు

2015 క్యాలెండర్ _ నవంబర్ _ యల్.యస్.సిద్ధాంతి.

శ్రీ కాలనిర్ణయ పంచాంగకర్త,
శ్రీ లలితాంబికా జ్యోతిషామృత నిలయం.


2015 Calendar_ DECEMBER _by L S Siddhanthy

కల్యాది ౫౧౧౬, శాలివాహన శకం ౧౯౩౭,
శ్రీ మన్మథ నామ సంవత్సర కార్తీక బహుళ షష్ఠి మంగళ వారం నుండి
శ్రీ మన్మథ నామ సంవత్సర మార్గశిర బహుళ షష్ఠి గురు వారం వరకు

2015 క్యాలెండర్ _ డిసెంబర్ _ యల్.యస్.సిద్ధాంతి.

శ్రీ కాలనిర్ణయ పంచాంగకర్త,
శ్రీ లలితాంబికా జ్యోతిషామృత నిలయం.16, సెప్టెంబర్ 2014, మంగళవారం

శ్రీ జయ నామ సంవత్సర శరన్నవరాత్రి కలశ స్థాపన కాల నిర్ణయము


శ్రీ జయ నామ సంవత్సర శరన్నవరాత్రి కలశ స్థాపన కాల నిర్ణయము_ యల్.యస్. సిద్ధాన్తి
 Sri jaya nama samvatsara sharannavaratri (devi navaratri) kalasha sthapana nirnayam _ L S Siddhanthy

9, సెప్టెంబర్ 2014, మంగళవారం

శ్రీ జయ నామ సంవత్సర మహాలయ పక్ష శ్రాద్ధ నిర్ణయము_LSSIDDHANTHY

శ్రీ జయ నామ సంవత్సర మహాలయ పక్ష శ్రాద్ధ నిర్ణయము

మహాలయ పక్ష శ్రాద్ధ నిర్ణయము హైద్రాబాద్, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్టణం, తిరుపతి, ఒంగోలు ప్రాంతములకు విడివిడిగా అపరాహ్ణకాలముల వివరణ
ప్రాతస్సంగవ మధ్యాహ్ణ అపరాహ్ణో స్సాయమిత్యపి । ప్రదోషస్సంగవ నిశీ బ్రాహ్మీ అరుణోదయమిత్యపి ॥
పగటి సమయ కాలములు- ప్రాతఃకాలము, సంగవ కాలము, మధ్యాహ్ణ కాలము, అపరాహ్ణ కాలము, సాయం కాలములు
రాత్రి సమయ కాలములు- ప్రదోష కాలము, సంగవ కాలము, నిశీ కాలము, బ్రాహ్మీ కాలము, అరుణోదయ కాలములు
ఏ కాలములో చేయవలసిన కార్యక్రమములు ఆ కాలము లో చేయవలయును శ్రాధము ఎప్పుడైనా శ్రాద్ధకాలము లోనే చేయవలయును కానీ ప్రస్తుతము ౧౧ లేదా ౧౨ గంటలకే చేస్తున్నారు అది శాస్త్ర విరుద్ధం
శ్రాద్ధకర్మ కరిష్యే అనే మాట ఎప్పుడంటున్నరు శ్రాద్ధకాలములోనా లేక మధ్యాహ్ణ కాలములోనా అదికూడా ప్రధానమే. కర్మకు ఉద్యుక్తుడవుతున్నాడంటే తప్పనిసరిగా ఆ సమయములో ఆ శ్రాద్ధకాలము ఉండాలి
శ్రాద్ధకర్మ తను సంకల్పించు సమయమునుండీ అపరాహ్ణకాలము ఉండాలి
మధ్యాహ్ణకాలములో సంకల్పించి అపరాహ్ణకాలములో చేయడము సరికాదు__L S SIDDHANTHY
శ్రీ జయ నామ సంవత్సర మహాలయ పక్ష శ్రాద్ధ నిర్ణయము_LSSIDDHANTHY5, సెప్టెంబర్ 2014, శుక్రవారం

Sri manmatha nama samvatsara kalanirnaya panchangam

శ్రీ మన్మథ నామ సంవత్సర కాల నిర్ణయ పంచాంగమ్

Sri manmatha nama samvatsara kalanirnaya panchangam 
godavari pushkaramulapai pratyeka vivarana tho & devalaya vastu ku sambandhinchina pramana shlokamulatho kudina pratyeka vyasam & prapanchavyapthamuga 2015-2016 lo darshanamagui grahanamula vivaranatho marenno sapramana vishayamulatho Sri manmatha nama samvatsara kalanirnaya panchangam
jaganmatha & jagadguruvula anugrahamutho twaralo avishkarinchabotunnanu

"గోదావరి పుష్కరముల" పై ప్రత్యేక వివరణ & "దేవాలయ వాస్తు" కు  సంబంధించిన ప్రమాణ శ్లోకములతో కూడిన ప్రత్యేక వ్యాసం & ప్రపంచవ్యాప్తంగా ౨౦౧౫-౨౦౧౬ లో దర్శనమగు గ్రహణములవివరణతో, మరెన్నో సప్రమాణ విషయములతో "శ్రీ మన్మథ నామసంవత్సర కాలనిర్ణయ పంచాంగం" జగన్మాత అనుగ్రహముతో జగద్గురువుల ఆశీస్సులతో త్వరలో ఆవిష్కరించబోతున్నాను.

L.S.SIDDHANTHY —

"ప్రకృతిని కాపాడుదాం" - "పరమాత్మ అనుగ్రహం పొందుదాం" "అదృష్ట వృక్షములు"

వర్షఋతువు పూర్తి అయ్యే ౧౫ రోజుల ముందునుండీ రెండునెలల కాలము "యమదంష్ట్ర కాలం" (రోగవృద్ధి కాలం) అని అంటారు.
ఇట్టి సమయమందు వారి వారి జన్మనక్షత్రముల రీత్యా అదృష్ట వృక్షములను నాటినా, పెంచినా, ఆరాధించినా తద్దోషములు తొలగి సర్వులూ & సమాజమూ రోగబాధలు లేక సుభిక్షముగా ఉండునని శాస్త్రవచనం. (అందుకే వర్షఋతువులో వచ్చే విఘ్నేశ్వర స్వామి పూజలో అనేక వృక్షజాతుల దళములతో, ఫలములతో ఆరాధించడము అనాదిగా జరుగుతున్నది).
జన్మ నక్షత్రములు తెలిసినవారు జన్మ నక్షత్రముల రీత్యా లేదా పిలిచే పేరులోని మొదటి అక్షరముల రీత్యా అదృష్టవృక్షములను నాటండి ప్రకృతి అనుగ్రహం పొందండి.
"ప్రకృతియే పరమాత్మ"
"ప్రకృతిని కాపాడుదాం" - "పరమాత్మ అనుగ్రహం పొందుదాం"
॥లోకాస్సమస్తా స్సుఖినోభవంతు॥
(విష్ణు & అగ్ని పురాణం)
యల్.యస్.సిద్ధాన్తి

గణపతి వైభవం

గణపతి వైభవం