సూక్తి

అక్షరాణి పరీక్ష్యంతాం అంబరాడంబరేణ కిమ్? శంభురంబరహీనోపి సర్వజ్ఞః కిం న జాయతే ?
( వేషాన్నేం పరీక్షిస్తారు? చదువును పరీక్షించండి. దిగంబరుడైతే మాత్రం - శివుడు సర్వజ్ఞుడు కాడా ?)

26, ఆగస్టు 2012, ఆదివారం

SIMHA SAMKRAMANA PHALITAMU

సూర్యసిద్ధాంత రీత్యా శ్రీ నందన నామ సంవత్సర శ్రావణ బహుళ అమావాస్య శుక్రవారం ది.వి.17-08-2012 రోజున ఉదయం 8-13 నిమిషములకు శ్రీసూర్యభగవానుదు మిశ్రయను నామధేయము కలవాడై మేష వాహనారూఢుడై సింహరాశిలో ప్రవేశించుచున్నాడు. సింహ సంక్రమణ పుణ్యకాలం:- 17-08-2012 న ఉదయం 8-13 నుండి మధ్యాహ్నం 2-37 వరకు. ఈ పుణ్యకాలంలో చదువవలసిన శ్లోకం:-
శారికా వాహనారూఢం ఖడ్గఖేటలసత్కరం | నభోమాస నమావ్యద్యక్తేశా నామపనుత్తయే || సింహ సంక్రమణ పురుషుదు శంఖ స్నానము చేయుటవలన శుభము. పర్ణ(ఆకుల)వస్త్రము ధరించుట వలన శుభము. కృష్ణాగరుగంధలేపనము చేసుకొనుటవలన సుగంధములకు ధరలు పెరుగును. పాటలీపుష్పము ధరించుటచే ఆధికారులకు ప్రాణభయము. సువర్ణ ఉంగరము ధరించుటచే లోహములకు ధరలు పెరుగును. వెదురు పాత్రయందు తేనె తాగుటవలన గొడవలు పెరుగును. ఖర్జూర తాంబూల సేవనం చేయుటవలన ధాన్యములకు ధరలు పెరుగును. అంకుశమను ఆయుధము ధరించుటచే గజములకు హాని కలుగును. ఊర్ద్వముఖుడగుతచే కూరగాయలకు వెలలు పెరుగును. ఈవిధముగా మన పూర్వీకులు గ్రహ గమనముననుసరించి ఫలితములు చెప్పెడివారు. దొషములు తొలగుటకు గోసేవ చేయుట,వృక్ష సేవ చేయుట ఎరుపు వస్త్రములు దానము చేయుట వలన షుభము చేకూరును. ఆశ్రేషా, మఖా, స్వతీ నక్షత్రముల ఈ నెల (17-08-2012 నుంది 17-09-2012 వరకు) వారు జాగ్రత్త వహించగలరు శుభం శ్రీమాతృ ఆనుగ్రహ సిద్ధిరస్తు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి